Showing posts with label తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ. Show all posts
Showing posts with label తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ. Show all posts

Thursday, 22 September 2011

All guests look release of Telugu Punnami


Yarlagadda taking blessings of Cinare surprised all


Yarlagadda WITH Ramojirao


Cinare release PUNNAMI VENNALA BOOK


Cinare release Souvenir


Yarlagadda,BuddhaPrasad with Cinare

yarlagadda,abk,prachina telugu lipi,damodhar rao musham,Mandali Buddha Prasad US trip 

Schedule,తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ,



Lighting Candles


Leading guests to Stage


Unveiling Telugutalli statue


Going to invite chief guest


Inviting CINARE and Ramoji rao


Yarlagadda,BuddhaPrasad felicitaing ASI director Chinna Reddy


World Telugu writers conference Dias,


Wednesday, 21 September 2011

శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ప్రాంగణంలో కృష్ణ దేవరాయలు

అది, 2008లో కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ప్రాంగణంలో కృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద కావ్యానికి శ్రీకారం చుట్టిన మంటపాన్ని పునర్నిర్మింపచేసి, అందులో కృష్ణ దేవరాయలు కావ్యరచన చేస్తున్న భంగిమలో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తున్న సందర్భం. రాష్ట్రం అంతా బుద్ధప్రసాద్‌ కు రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా అవకాశం వస్తుందనీ ఆయనకు విద్యా, సాంస్కృతిక శాఖలు అప్పగిస్తారని ఎదురు చూస్తున్న సమయం అది. సరిగ్గా సభలు ప్రారంభమయ్యే సమయానికి కృష్ణా జిల్లాకు ముఖ్యమంత్రి అధికార పర్యటనకు వచ్చారు .పదవులు ఆశిస్తున్న జిల్లా రాజకీయ శక్తులన్నీ ముఖ్యమంత్రి చుట్టూ కేంద్రీకరించి ఉన్నాయి. బుద్ధప్రసాద్‌ మాత్రం సభల ఏర్పాటు మీద మాత్రమే మనసు లగ్నం చేశారు ముఖ్యమంత్రి కలవటానికి వెళ్ళనే లేదు. అదీ ఆయన నిబద్ధత...!
శ్రీకాకుళం సభలు : రెండవ తెలుగు భాషోద్యమం : మండలి బుద్ధప్రసాద్‌ నేతృత్వంలో తెలుగువారి తొలి రాజధాని కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో 2002 నవంబర్‌ 1, 2 తేదీలలో జరిగిన తెలుగు భాషోద్యమ సమాలోచన శిబిరం తెలుగు భాషోద్యమానికి నాందీ పలికింది. అమ్మ భాష పట్ల మమతానురాగాల్ని పెంపొందించటం ప్రధాన కార్యక్రమంగా ప్రజల గుండె తలుపులు తట్టి భాషా చైతన్యాన్ని కలిగించే అనేక కార్యక్రమాలు ఆనాటినుంచీ తెలుగు నేలమీద ముమ్మరంగా జరిగాయి. ఇదే సభలో తెలుగు భాషోద్యమ సమాఖ్య శ్రీకారం చుట్టుకుంది. బుద్ధప్రసాద్‌ నాయకత్వంలో డా. సామల రమేష్‌బాబు, సి.ధర్మారావు ఇంకా ఎందరో బాషోద్యమానికి నడుం బిగించారు. గిడుగువారు నడిపిన వ్యావహారిక భాషోద్యమానికి కొనసాగింపుగా దీనిని రెండవ తెలుగు భాషోద్యమం అన్నారు.
జీవో నం.86 సాధన : తెలుగువాడిగా పుట్టి, తెలుగునేల మీద తెలుగు అక్షరంముక్క నేర్చుకోకుండా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తిచేసుకునే దురదృష్టకర అవకాశం ఈ దేశంలో ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగు చదవకుండా వుంటేనే ప్రభుత్వ గుర్తింపు ఉంటుందనే పరిస్థితి నడుస్తోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు బుద్ధప్రసాద్‌. దానిపైన విస్తృత పోరాటమే ఆయన చేయాల్సి వచ్చింది. తెలుగు భాషోద్యమం, తెలుగు భాషోద్యమ సమాఖ్య, తెలుగు భాషాభిమానులు ఆయనకు అండగా నిలబడ్డారు. దాని ఫలితంగానే జీవో నం.86 ను ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. అక్షరాభ్యాసం నుంచి 10వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరిగా బోధనాంశంగా ఉండాలనేది ఈ 86వ జీవో సారాంశం. త్రిభాషా సూత్రానికి అనుగుణంగా తెలుగును తప్పనిసరి చేస్తున్న జీవో. భాషోద్యమ పరంగా ఇది బుద్ధప్రసాద్‌ అధిగమించిన ఒక మైలురాయి. హైదరాబాద్‌లో తెలుగుతల్లి విగ్రహం మీద తెలుగుతల్లి అని తెలుగులో రాయకపోవటం, సెక్రెటేరియట్‌లో రాష్ట్ర సచివాలయం అని తెలుగు అక్షరాల్లో ఎక్కడా లేకపోవడం, ఏ ఊళ్ళోనూ ఏ దుకాణం మీదా ఒక్క తెలుగు బోర్జు కనిపించకపోవడం ఇలా తెలుగు అనేది ఒక పనికిరాని అంశంగా మారిపోతోందని ఆయన ఆవేదన చెంది చేసిన ఆందోళన ఫలితంగా సచివాలయంలో ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి. తెలుగు తల్లి అని మనం ఇప్పుడు తెలుగులో చదవవచ్చు.

తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ,


ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమానికి కర్త, కర్మ, క్రియ ఆయనే! ప్రజల గుండె తలుపులు తట్టి వారిలో తెలుగు భాష పట్ల గౌరవాన్ని, తెలుగు సంస్కృతి పట్ల అభిమానాన్ని ప్రేరేపిస్తూ, భాషా జాతీయులుగా తెలుగు వారి చరిత్రని వెలుగులోకి తేవటం ఆయన ఏర్పరచుకొన్న పెద్ద ప్రణాళిక. ఆయన అడుగులో అడుగువేస్తూ ఆయన్ని వెన్నంటి ఎందరో ప్రముఖులైన సాహితీవేత్తలు, భాషావేత్తలూ, చరిత్రవేత్తలు నడుస్తున్నారు. మరెందరో భాషాభిమానులు వీర సైనికులై కవాతు చేస్తున్నారు. ప్రణాళికాబద్ధమైన బుద్ధప్రసాద్‌ కృషి ఫలితంగా, ఇంటి భాషగా, బడి భాషగా, ఏలుబడి భాషగా తెలుగు అమలు గురించి ఆయన నేతృత్వంలో జరుగుతున్న పోరాటాలకు ఇప్పుడు విశేఓష స్పందన వస్తోంది. 2002 నుంచి ఇదే అంశంపైన దృష్టి కేంద్రీకరించి సాగిస్తూ వస్తున్న అనేక కార్యక్రమాలకు ఫలాలు అందటం అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రజలు తెలుగులో మాట్లాడటం ఒక గౌరవనీయమైన అంశంగా భావించుకోవటం ఎల్లెడలా కనిపిస్తోంది. ఇది ఆహ్వానించదగిన చక్కని పరిణామం.
స్వాతంత్య్రోద్యమం తర్వాత పుట్టినవారే ఎక్కువగా ఉన్న ఈనాటి సమాజంలో ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉంటుందో బుద్ధప్రసాద్‌ నాయకత్వాన తెలుగు భాషోద్యమంలో పనిచేస్తున్న వారికి చక్కగా అనుభవంలోకి వస్తోంది. గాంధీ సిద్ధాంతాలను, ఆయన నాయకత్వ విధానాన్ని, ఆయన కార్యచరణను పుణికి పుచ్చుకొని తెలుగు భాషోద్యమాన్ని ఆయన నడుపుతున్నారు. వ్యక్తిగతమైన ప్రచారాలకు ప్రయోజనాలకు ప్రభావాలకూ తావివ్వని రీతిలో ఆయన ఈ ఉద్యమాన్ని నడుపుతున్న తీరు సన్నిహితంగా వ్యవహరించేవారికి సైతం విస్మయం గొలుపుతుంది. ఒక చిన్న సంఘటనని అప్రస్తుతమైనా ఇక్కడ ప్రస్తావించక తప్పదు

తెలుగు సాంస్కృతిక 'మండలి'


తెలుగు సాంస్కృతిక 'మండలి'

ANDHRA PRABHA NEWS
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, పురావైభవాన్ని చాటడం ఆయన లక్ష్యం. అందుకోసం అందుకోసం ఎంతటి శ్రమకైనా తట్టుకోగలిగే గుండె నిబ్బరం ఆయనకుంది. సమాజం, సాహిత్యం, సంస్కృతుల త్రివేణి మండలి బుద్ధప్రసాద్‌. తెలుగు వాస్తవికతకు నిలువెత్తు నిదర్శనం. దార్శనికుడయిన తండ్రి మండలి వెంకట కృష్ణారావు, సంస్కృతి ప్రతిబింబమైన తల్లి ప్రభావతీ దేవి కలల పంటగా 1956 మే నెల 26వ తేదీన బుద్ధప్రసాద్‌ జన్మించారు, తెలుగు దనం- తెలుగుధనం నిండిన కుటుంబం, గాంధేయ వాదం, గాంధీ నాదం ప్రతిధ్వనించే ఇల్లు... పుట్టిన నాటినుంచీ పెరిగిన, ఎదిగిన జాతీయతా భావం, అన్నీ కలగలసి మూర్తీభవించిన రూపసి బుద్ధప్రసాద్‌. డా. బెజవాడ గోపాలరెడ్డి, ఆచార్య ఎన్‌.జి.రంగా, ప్రభాకర్‌ జీ లాంటి సత్ఫురుషుల సాంగత్యం చిన్ననాటినుంచే కలిగాయి. మండలి వెంకట కృష్ణారావు గారి సేవా నిరతిని అందుకుంటూ, ఆ ఆలోచనల్లోంచి, ఆచరణల్లోంచి, ఆకాంక్షల్లోంచి అంకురించి, తండ్రిని మరిపించిన మహావృక్షమై ఎదిగాడు బుద్ధప్రసాద్‌.
apr -   Sun, 22 May 2011, IST
''యం సంగతి గుణా: పుంసాం వికసంత్యేన తే స్వయం'' అంటుంది ఆర్యోక్తి. యోగ్యమైన గుణాలు ఉంటే వాటంతట అవే బయటపడి లోకోపకారకం అవుతాయి. కస్తూరి సువాసనని ఆపితే ఆగుతుందా... అని అడుగుతుందా శ్లోకం. యోగ్యతలు లోకహితం కావాలి. మండలి బుద్ధప్రసాద్‌ యోగ్యమైన ఆలోచనలన్నీ తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ దిశగా సాగాయి. బుద్ధప్రసాద్‌ తెలుగు భాషోద్యమ నిర్మాణం కోసం మొదటగా నడుం బిగించిన యోథుడు. ఆయనే ప్రేరకుడు, ఆయనే పాత్రధారి, ఆయనకు ముందు ఎన్నో తరాలుగా భాషా పరిరక్షకులు వెలిగించిన జ్యోతిని ఆయన అందుకున్నారు. ఒక జ్యోతితో అనేక జ్యోతులను వెలిగించినట్టు ఆయన భాషోద్యమ కార్యకర్తలను తీర్చిదిద్దుతున్నారు.