Thursday, 22 September 2011
Wednesday, 21 September 2011
ప్రాచీన భాషగా అనధికార తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో బుద్ధప్రసాద్ ప్రవేశపెట్టారు
ప్రాచీన భాషగా అనధికార తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో బుద్ధప్రసాద్ ప్రవేశపెట్టారు
కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాషగా తమిళ భాషకు గుర్తింపు నిచ్చిన వెంటనే తొలిగా ప్రతిస్పందించింది బుద్ధప్రసాద్! ఆనాడు ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభ్యుడిగా తెలుగు భాషకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని చర్చకు కోరుతూ ఒక అనధికార తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో బుద్ధప్రసాద్ ప్రవేశపెట్టారు.
ఇలా భాష కోసం రాజకీయ వ్యవస్థని కదిలించగలగడం మన రాష్ట్రంలో ఇదే మొదటిసారని చెప్పాలి. బాష గురించి మాట్లాడేవాళ్ళ పట్ల రాజకీయ నాయకులకు సహజంగా ఉండే చిన్న చూపుని బుద్ధప్రసాద్ తోసి రాజనగలిగారు. ఈ రోజున ఏ మంత్రిపదవీ, కనీసం శాసనసభ్యత్వం లాంటివి కూడా లేకపోయినా, దేశంలో తెలుగు భాషా సంస్కృతుల నిలువెత్తు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
శక్తులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తెలుగు భాషకు విశిష్ట ప్రాచీనతా హోదాకోసం పోరాటం : 2004 సెప్టెంబర్ 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం తమిళ భాషకు క్లాసికల్ హోదాని ప్రకటించిన తరువాత బుద్ధప్రసాద్ తెలుగు భాషోద్యమ శక్తియుక్తులన్నింటినీ తెలుగు భాష ప్రాచీనత నిరూపించే పరిశోధనలవైపు, కార్యక్రమాలవైపు మళ్లించారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వంపైన రాజకీయ వత్తిళ్ళతోనే తెలుగు భాషకు ప్రాచీనతా హోదాని సాధించగలమనేది వాస్తవం. అయినా, బుద్ధప్రసాద్ తెలుగువారి ప్రాచీనతని నిరూపించవలసిందిగా పరిశోధకులకు గట్టి పిలుపునిచ్చారు. తెలుగు భాష ప్రాచీనతని నిర్ణయించటం, ప్రాచీనమైన తెలుగు సంస్కృతిని పరిరక్షించే చర్యలు తీసుకోవటం పైన బుద్ధప్రసాద్ ప్రధానంగా తన దృష్టిని కేంద్రీకరించి భాషోద్యమాన్ని కొత్త మార్గాన నడిపించారు. భాషావేత్తలతోపాటు, చరిత్రకారులూ, ఔత్సాహికులైన పరిశోధకులూ ఆయన పిలుపుకు ఎంతగానో ప్రతిస్పందించి ఈ ఐదేళ్ళ కాలంలో వెలుగులోకి తెచ్చిన విశేషాలు ఎన్నో వున్నాయి. బుద్ధప్రసాద్ నాయకత్వాన తెలుగే ప్రాచీనమని ఎలుగెత్తి చాటారు తెలుగు ప్రజలు. కృష్ణా జిల్లా రచయితల సంఘం బుద్ధప్రసాద్ అధ్యక్షతన విజయవాడలో తెలుగుభాష విశిష్టత ప్రాచీనతలపైన జాతీయ సదస్సు, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ బుద్ధప్రసాద్ ప్రేరణతో ఢిల్లీలో 2008 జూలైలో నిర్వహించిన తెలుగు కన్నడ సదస్సు ముఖ్యమైన మలుపులుగా తెలుగు భాషకు క్లాసికల్ హోదా లభించింది. ఎందరినో ఇందులో భాగస్వాములను చేసి అన్నింటా తానై, అన్ని విధాలా తీసుకువచ్చిన వత్తిడి ఫలితంగానే మనం తెలుగు భాషకు క్లాసికల్ హోదాని సాధించుకో గలిగామన్నది వాస్తవం.
- డా్ప్ప జి.వి.పూర్ణచందు
శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ప్రాంగణంలో కృష్ణ దేవరాయలు
అది, 2008లో కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ప్రాంగణంలో కృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద కావ్యానికి శ్రీకారం చుట్టిన మంటపాన్ని పునర్నిర్మింపచేసి, అందులో కృష్ణ దేవరాయలు కావ్యరచన చేస్తున్న భంగిమలో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తున్న సందర్భం. రాష్ట్రం అంతా బుద్ధప్రసాద్ కు రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా అవకాశం వస్తుందనీ ఆయనకు విద్యా, సాంస్కృతిక శాఖలు అప్పగిస్తారని ఎదురు చూస్తున్న సమయం అది. సరిగ్గా సభలు ప్రారంభమయ్యే సమయానికి కృష్ణా జిల్లాకు ముఖ్యమంత్రి అధికార పర్యటనకు వచ్చారు .పదవులు ఆశిస్తున్న జిల్లా రాజకీయ శక్తులన్నీ ముఖ్యమంత్రి చుట్టూ కేంద్రీకరించి ఉన్నాయి. బుద్ధప్రసాద్ మాత్రం సభల ఏర్పాటు మీద మాత్రమే మనసు లగ్నం చేశారు ముఖ్యమంత్రి కలవటానికి వెళ్ళనే లేదు. అదీ ఆయన నిబద్ధత...!
శ్రీకాకుళం సభలు : రెండవ తెలుగు భాషోద్యమం : మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో తెలుగువారి తొలి రాజధాని కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో 2002 నవంబర్ 1, 2 తేదీలలో జరిగిన తెలుగు భాషోద్యమ సమాలోచన శిబిరం తెలుగు భాషోద్యమానికి నాందీ పలికింది. అమ్మ భాష పట్ల మమతానురాగాల్ని పెంపొందించటం ప్రధాన కార్యక్రమంగా ప్రజల గుండె తలుపులు తట్టి భాషా చైతన్యాన్ని కలిగించే అనేక కార్యక్రమాలు ఆనాటినుంచీ తెలుగు నేలమీద ముమ్మరంగా జరిగాయి. ఇదే సభలో తెలుగు భాషోద్యమ సమాఖ్య శ్రీకారం చుట్టుకుంది. బుద్ధప్రసాద్ నాయకత్వంలో డా. సామల రమేష్‌బాబు, సి.ధర్మారావు ఇంకా ఎందరో బాషోద్యమానికి నడుం బిగించారు. గిడుగువారు నడిపిన వ్యావహారిక భాషోద్యమానికి కొనసాగింపుగా దీనిని రెండవ తెలుగు భాషోద్యమం అన్నారు.
జీవో నం.86 సాధన : తెలుగువాడిగా పుట్టి, తెలుగునేల మీద తెలుగు అక్షరంముక్క నేర్చుకోకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేసుకునే దురదృష్టకర అవకాశం ఈ దేశంలో ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగు చదవకుండా వుంటేనే ప్రభుత్వ గుర్తింపు ఉంటుందనే పరిస్థితి నడుస్తోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు బుద్ధప్రసాద్. దానిపైన విస్తృత పోరాటమే ఆయన చేయాల్సి వచ్చింది. తెలుగు భాషోద్యమం, తెలుగు భాషోద్యమ సమాఖ్య, తెలుగు భాషాభిమానులు ఆయనకు అండగా నిలబడ్డారు. దాని ఫలితంగానే జీవో నం.86 ను ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. అక్షరాభ్యాసం నుంచి 10వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరిగా బోధనాంశంగా ఉండాలనేది ఈ 86వ జీవో సారాంశం. త్రిభాషా సూత్రానికి అనుగుణంగా తెలుగును తప్పనిసరి చేస్తున్న జీవో. భాషోద్యమ పరంగా ఇది బుద్ధప్రసాద్ అధిగమించిన ఒక మైలురాయి. హైదరాబాద్‌లో తెలుగుతల్లి విగ్రహం మీద తెలుగుతల్లి అని తెలుగులో రాయకపోవటం, సెక్రెటేరియట్‌లో రాష్ట్ర సచివాలయం అని తెలుగు అక్షరాల్లో ఎక్కడా లేకపోవడం, ఏ ఊళ్ళోనూ ఏ దుకాణం మీదా ఒక్క తెలుగు బోర్జు కనిపించకపోవడం ఇలా తెలుగు అనేది ఒక పనికిరాని అంశంగా మారిపోతోందని ఆయన ఆవేదన చెంది చేసిన ఆందోళన ఫలితంగా సచివాలయంలో ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి. తెలుగు తల్లి అని మనం ఇప్పుడు తెలుగులో చదవవచ్చు.
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ,
ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమానికి కర్త, కర్మ, క్రియ ఆయనే! ప్రజల గుండె తలుపులు తట్టి వారిలో తెలుగు భాష పట్ల గౌరవాన్ని, తెలుగు సంస్కృతి పట్ల అభిమానాన్ని ప్రేరేపిస్తూ, భాషా జాతీయులుగా తెలుగు వారి చరిత్రని వెలుగులోకి తేవటం ఆయన ఏర్పరచుకొన్న పెద్ద ప్రణాళిక. ఆయన అడుగులో అడుగువేస్తూ ఆయన్ని వెన్నంటి ఎందరో ప్రముఖులైన సాహితీవేత్తలు, భాషావేత్తలూ, చరిత్రవేత్తలు నడుస్తున్నారు. మరెందరో భాషాభిమానులు వీర సైనికులై కవాతు చేస్తున్నారు. ప్రణాళికాబద్ధమైన బుద్ధప్రసాద్ కృషి ఫలితంగా, ఇంటి భాషగా, బడి భాషగా, ఏలుబడి భాషగా తెలుగు అమలు గురించి ఆయన నేతృత్వంలో జరుగుతున్న పోరాటాలకు ఇప్పుడు విశేఓష స్పందన వస్తోంది. 2002 నుంచి ఇదే అంశంపైన దృష్టి కేంద్రీకరించి సాగిస్తూ వస్తున్న అనేక కార్యక్రమాలకు ఫలాలు అందటం అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రజలు తెలుగులో మాట్లాడటం ఒక గౌరవనీయమైన అంశంగా భావించుకోవటం ఎల్లెడలా కనిపిస్తోంది. ఇది ఆహ్వానించదగిన చక్కని పరిణామం.
స్వాతంత్య్రోద్యమం తర్వాత పుట్టినవారే ఎక్కువగా ఉన్న ఈనాటి సమాజంలో ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉంటుందో బుద్ధప్రసాద్ నాయకత్వాన తెలుగు భాషోద్యమంలో పనిచేస్తున్న వారికి చక్కగా అనుభవంలోకి వస్తోంది. గాంధీ సిద్ధాంతాలను, ఆయన నాయకత్వ విధానాన్ని, ఆయన కార్యచరణను పుణికి పుచ్చుకొని తెలుగు భాషోద్యమాన్ని ఆయన నడుపుతున్నారు. వ్యక్తిగతమైన ప్రచారాలకు ప్రయోజనాలకు ప్రభావాలకూ తావివ్వని రీతిలో ఆయన ఈ ఉద్యమాన్ని నడుపుతున్న తీరు సన్నిహితంగా వ్యవహరించేవారికి సైతం విస్మయం గొలుపుతుంది. ఒక చిన్న సంఘటనని అప్రస్తుతమైనా ఇక్కడ ప్రస్తావించక తప్పదు
తెలుగు సాంస్కృతిక 'మండలి'
తెలుగు సాంస్కృతిక 'మండలి'
ANDHRA PRABHA NEWSతెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, పురావైభవాన్ని చాటడం ఆయన లక్ష్యం. అందుకోసం అందుకోసం ఎంతటి శ్రమకైనా తట్టుకోగలిగే గుండె నిబ్బరం ఆయనకుంది. సమాజం, సాహిత్యం, సంస్కృతుల త్రివేణి మండలి బుద్ధప్రసాద్. తెలుగు వాస్తవికతకు నిలువెత్తు నిదర్శనం. దార్శనికుడయిన తండ్రి మండలి వెంకట కృష్ణారావు, సంస్కృతి ప్రతిబింబమైన తల్లి ప్రభావతీ దేవి కలల పంటగా 1956 మే నెల 26వ తేదీన బుద్ధప్రసాద్ జన్మించారు, తెలుగు దనం- తెలుగుధనం నిండిన కుటుంబం, గాంధేయ వాదం, గాంధీ నాదం ప్రతిధ్వనించే ఇల్లు... పుట్టిన నాటినుంచీ పెరిగిన, ఎదిగిన జాతీయతా భావం, అన్నీ కలగలసి మూర్తీభవించిన రూపసి బుద్ధప్రసాద్. డా. బెజవాడ గోపాలరెడ్డి, ఆచార్య ఎన్.జి.రంగా, ప్రభాకర్ జీ లాంటి సత్ఫురుషుల సాంగత్యం చిన్ననాటినుంచే కలిగాయి. మండలి వెంకట కృష్ణారావు గారి సేవా నిరతిని అందుకుంటూ, ఆ ఆలోచనల్లోంచి, ఆచరణల్లోంచి, ఆకాంక్షల్లోంచి అంకురించి, తండ్రిని మరిపించిన మహావృక్షమై ఎదిగాడు బుద్ధప్రసాద్.
apr - Sun, 22 May 2011, IST
''యం సంగతి గుణా: పుంసాం వికసంత్యేన తే స్వయం'' అంటుంది ఆర్యోక్తి. యోగ్యమైన గుణాలు ఉంటే వాటంతట అవే బయటపడి లోకోపకారకం అవుతాయి. కస్తూరి సువాసనని ఆపితే ఆగుతుందా... అని అడుగుతుందా శ్లోకం. యోగ్యతలు లోకహితం కావాలి. మండలి బుద్ధప్రసాద్ యోగ్యమైన ఆలోచనలన్నీ తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ దిశగా సాగాయి. బుద్ధప్రసాద్ తెలుగు భాషోద్యమ నిర్మాణం కోసం మొదటగా నడుం బిగించిన యోథుడు. ఆయనే ప్రేరకుడు, ఆయనే పాత్రధారి, ఆయనకు ముందు ఎన్నో తరాలుగా భాషా పరిరక్షకులు వెలిగించిన జ్యోతిని ఆయన అందుకున్నారు. ఒక జ్యోతితో అనేక జ్యోతులను వెలిగించినట్టు ఆయన భాషోద్యమ కార్యకర్తలను తీర్చిదిద్దుతున్నారు.
Tuesday, 20 September 2011
తొలి తెలుగు మహిళా ఆత్మకథ
తొలి తెలుగు మహిళా ఆత్మకథ – ఏడిదము సత్యవతి ఆత్మచరితము
ఈ పుస్తకం మొదటిసారి 1934లో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రణశాలయందు క.కోదండరామయ్యగారిచే ముద్రించబడింది. ఈ పుస్తకం ముందుమాట (ఫిబ్రవరి 1, 1934) వ్రాసినప్పుడు సత్యవతిగారు అవనిగడ్డలో ఉన్నారు. స్త్రీలు తెలుగులో రాసిన ఆత్మకథల్లో ఇది మొదటిది కావచ్చు అని ఈ పుస్తకానికి విపులమైన ముందుమాట వ్రాసిన శ్రీ వకుళాభరణం రామకృష్ణ భావించారు. ఆయన పరిశోధన ప్రకారం, 1934కు ముందు తెలుగులో మూడు ఆత్మకథలు మాత్రమే ప్రచురింపబడ్డాయి
for more info see http://prachinatelugu.blogspot.com
Mandali Buddha Prasad US trip Schedule
Mandali Buddha Prasad(Former Minister of AP) US trip Schedule
Emirates - EK 525 FRI 23SEP
HYDERABAD(04:20) DUBAI AE(06:20)
Emirates - EK 225 FRI 23SEP
Dubai AE(08:20) San Fransisco CA(13:05)
25-27 sept 2011 - San Jose/San Fransisco
27 sept 2011. - Mandali Venkata Krishna Rao Vardhanthi
28-30 sept 2011 - International Telugu Internet Conference, MILPITAS, CA (click here for schedule)
1st Oct 2011 - Andhra Cultural Festival, DeAnza College,Cupertino,CA
2nd Oct 2011 - Gandhi Jayanthi
san fransisco - miami
AMERICAN AIRLINES - AA 440
MON 03OCT SAN FRANCISCO CA(13:00) MIAMI FL(21:30)
4-6 oct 2011 Miami {contact no. ..............for contact no @ us
miami-new york
AMERICAN AIRLINES - AA 518
FRI 07OCT MIAMI FL(07:10) NEW YORK NY(09:55)
7-9 oct 2011 New York/New Jersey. {contact no.
9th night back to hyderabad
Emirates - EK 202
SUN 09OCT NEW YORK NY(23:00) DUBAI AE(19:45)
Emirates - EK 524 MON
10OCT DUBAI AE(21:45) HYDERABAD IN (02:55)
Subscribe to:
Posts (Atom)