తెలుగు సాంస్కృతిక 'మండలి'
ANDHRA PRABHA NEWSతెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, పురావైభవాన్ని చాటడం ఆయన లక్ష్యం. అందుకోసం అందుకోసం ఎంతటి శ్రమకైనా తట్టుకోగలిగే గుండె నిబ్బరం ఆయనకుంది. సమాజం, సాహిత్యం, సంస్కృతుల త్రివేణి మండలి బుద్ధప్రసాద్. తెలుగు వాస్తవికతకు నిలువెత్తు నిదర్శనం. దార్శనికుడయిన తండ్రి మండలి వెంకట కృష్ణారావు, సంస్కృతి ప్రతిబింబమైన తల్లి ప్రభావతీ దేవి కలల పంటగా 1956 మే నెల 26వ తేదీన బుద్ధప్రసాద్ జన్మించారు, తెలుగు దనం- తెలుగుధనం నిండిన కుటుంబం, గాంధేయ వాదం, గాంధీ నాదం ప్రతిధ్వనించే ఇల్లు... పుట్టిన నాటినుంచీ పెరిగిన, ఎదిగిన జాతీయతా భావం, అన్నీ కలగలసి మూర్తీభవించిన రూపసి బుద్ధప్రసాద్. డా. బెజవాడ గోపాలరెడ్డి, ఆచార్య ఎన్.జి.రంగా, ప్రభాకర్ జీ లాంటి సత్ఫురుషుల సాంగత్యం చిన్ననాటినుంచే కలిగాయి. మండలి వెంకట కృష్ణారావు గారి సేవా నిరతిని అందుకుంటూ, ఆ ఆలోచనల్లోంచి, ఆచరణల్లోంచి, ఆకాంక్షల్లోంచి అంకురించి, తండ్రిని మరిపించిన మహావృక్షమై ఎదిగాడు బుద్ధప్రసాద్.
''యం సంగతి గుణా: పుంసాం వికసంత్యేన తే స్వయం'' అంటుంది ఆర్యోక్తి. యోగ్యమైన గుణాలు ఉంటే వాటంతట అవే బయటపడి లోకోపకారకం అవుతాయి. కస్తూరి సువాసనని ఆపితే ఆగుతుందా... అని అడుగుతుందా శ్లోకం. యోగ్యతలు లోకహితం కావాలి. మండలి బుద్ధప్రసాద్ యోగ్యమైన ఆలోచనలన్నీ తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ దిశగా సాగాయి. బుద్ధప్రసాద్ తెలుగు భాషోద్యమ నిర్మాణం కోసం మొదటగా నడుం బిగించిన యోథుడు. ఆయనే ప్రేరకుడు, ఆయనే పాత్రధారి, ఆయనకు ముందు ఎన్నో తరాలుగా భాషా పరిరక్షకులు వెలిగించిన జ్యోతిని ఆయన అందుకున్నారు. ఒక జ్యోతితో అనేక జ్యోతులను వెలిగించినట్టు ఆయన భాషోద్యమ కార్యకర్తలను తీర్చిదిద్దుతున్నారు.
No comments:
Post a Comment