Wednesday 21 September 2011

తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ,


ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమానికి కర్త, కర్మ, క్రియ ఆయనే! ప్రజల గుండె తలుపులు తట్టి వారిలో తెలుగు భాష పట్ల గౌరవాన్ని, తెలుగు సంస్కృతి పట్ల అభిమానాన్ని ప్రేరేపిస్తూ, భాషా జాతీయులుగా తెలుగు వారి చరిత్రని వెలుగులోకి తేవటం ఆయన ఏర్పరచుకొన్న పెద్ద ప్రణాళిక. ఆయన అడుగులో అడుగువేస్తూ ఆయన్ని వెన్నంటి ఎందరో ప్రముఖులైన సాహితీవేత్తలు, భాషావేత్తలూ, చరిత్రవేత్తలు నడుస్తున్నారు. మరెందరో భాషాభిమానులు వీర సైనికులై కవాతు చేస్తున్నారు. ప్రణాళికాబద్ధమైన బుద్ధప్రసాద్‌ కృషి ఫలితంగా, ఇంటి భాషగా, బడి భాషగా, ఏలుబడి భాషగా తెలుగు అమలు గురించి ఆయన నేతృత్వంలో జరుగుతున్న పోరాటాలకు ఇప్పుడు విశేఓష స్పందన వస్తోంది. 2002 నుంచి ఇదే అంశంపైన దృష్టి కేంద్రీకరించి సాగిస్తూ వస్తున్న అనేక కార్యక్రమాలకు ఫలాలు అందటం అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రజలు తెలుగులో మాట్లాడటం ఒక గౌరవనీయమైన అంశంగా భావించుకోవటం ఎల్లెడలా కనిపిస్తోంది. ఇది ఆహ్వానించదగిన చక్కని పరిణామం.
స్వాతంత్య్రోద్యమం తర్వాత పుట్టినవారే ఎక్కువగా ఉన్న ఈనాటి సమాజంలో ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉంటుందో బుద్ధప్రసాద్‌ నాయకత్వాన తెలుగు భాషోద్యమంలో పనిచేస్తున్న వారికి చక్కగా అనుభవంలోకి వస్తోంది. గాంధీ సిద్ధాంతాలను, ఆయన నాయకత్వ విధానాన్ని, ఆయన కార్యచరణను పుణికి పుచ్చుకొని తెలుగు భాషోద్యమాన్ని ఆయన నడుపుతున్నారు. వ్యక్తిగతమైన ప్రచారాలకు ప్రయోజనాలకు ప్రభావాలకూ తావివ్వని రీతిలో ఆయన ఈ ఉద్యమాన్ని నడుపుతున్న తీరు సన్నిహితంగా వ్యవహరించేవారికి సైతం విస్మయం గొలుపుతుంది. ఒక చిన్న సంఘటనని అప్రస్తుతమైనా ఇక్కడ ప్రస్తావించక తప్పదు

No comments:

Post a Comment