Wednesday 21 September 2011

ప్రాచీన భాషగా అనధికార తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో బుద్ధప్రసాద్‌ ప్రవేశపెట్టారు

ప్రాచీన భాషగా అనధికార తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో బుద్ధప్రసాద్‌ ప్రవేశపెట్టారు

కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాషగా తమిళ భాషకు గుర్తింపు నిచ్చిన వెంటనే తొలిగా ప్రతిస్పందించింది బుద్ధప్రసాద్‌! ఆనాడు ప్రతిపక్ష కాంగ్రెస్‌ శాసనసభ్యుడిగా తెలుగు భాషకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని చర్చకు కోరుతూ ఒక అనధికార తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో బుద్ధప్రసాద్‌ ప్రవేశపెట్టారు.
ఇలా భాష కోసం రాజకీయ వ్యవస్థని కదిలించగలగడం మన రాష్ట్రంలో ఇదే మొదటిసారని చెప్పాలి. బాష గురించి మాట్లాడేవాళ్ళ పట్ల రాజకీయ నాయకులకు సహజంగా ఉండే చిన్న చూపుని బుద్ధప్రసాద్‌ తోసి రాజనగలిగారు. ఈ రోజున ఏ మంత్రిపదవీ, కనీసం శాసనసభ్యత్వం లాంటివి కూడా లేకపోయినా, దేశంలో తెలుగు భాషా సంస్కృతుల నిలువెత్తు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
శక్తులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తెలుగు భాషకు విశిష్ట ప్రాచీనతా హోదాకోసం పోరాటం : 2004 సెప్టెంబర్‌ 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం తమిళ భాషకు క్లాసికల్‌ హోదాని ప్రకటించిన తరువాత బుద్ధప్రసాద్‌ తెలుగు భాషోద్యమ శక్తియుక్తులన్నింటినీ తెలుగు భాష ప్రాచీనత నిరూపించే పరిశోధనలవైపు, కార్యక్రమాలవైపు మళ్లించారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వంపైన రాజకీయ వత్తిళ్ళతోనే తెలుగు భాషకు ప్రాచీనతా హోదాని సాధించగలమనేది వాస్తవం. అయినా, బుద్ధప్రసాద్‌ తెలుగువారి ప్రాచీనతని నిరూపించవలసిందిగా పరిశోధకులకు గట్టి పిలుపునిచ్చారు. తెలుగు భాష ప్రాచీనతని నిర్ణయించటం, ప్రాచీనమైన తెలుగు సంస్కృతిని పరిరక్షించే చర్యలు తీసుకోవటం పైన బుద్ధప్రసాద్‌ ప్రధానంగా తన దృష్టిని కేంద్రీకరించి భాషోద్యమాన్ని కొత్త మార్గాన నడిపించారు. భాషావేత్తలతోపాటు, చరిత్రకారులూ, ఔత్సాహికులైన పరిశోధకులూ ఆయన పిలుపుకు ఎంతగానో ప్రతిస్పందించి ఈ ఐదేళ్ళ కాలంలో వెలుగులోకి తెచ్చిన విశేషాలు ఎన్నో వున్నాయి. బుద్ధప్రసాద్‌ నాయకత్వాన తెలుగే ప్రాచీనమని ఎలుగెత్తి చాటారు తెలుగు ప్రజలు. కృష్ణా జిల్లా రచయితల సంఘం బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన విజయవాడలో తెలుగుభాష విశిష్టత ప్రాచీనతలపైన జాతీయ సదస్సు, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ బుద్ధప్రసాద్‌ ప్రేరణతో ఢిల్లీలో 2008 జూలైలో నిర్వహించిన తెలుగు కన్నడ సదస్సు ముఖ్యమైన మలుపులుగా తెలుగు భాషకు క్లాసికల్‌ హోదా లభించింది. ఎందరినో ఇందులో భాగస్వాములను చేసి అన్నింటా తానై, అన్ని విధాలా తీసుకువచ్చిన వత్తిడి ఫలితంగానే మనం తెలుగు భాషకు క్లాసికల్‌ హోదాని సాధించుకో గలిగామన్నది వాస్తవం.
- డా్ప్ప జి.వి.పూర్ణచందు

No comments:

Post a Comment