Sunday 4 December 2011

ప్రప0చ తెలుగుకు తొలి అడుగు -3


పెళ్లగి0పులు(data mining)అన్నీ తెలుగులో అడిగితే జరిగేలా ఉ0డాలి. నిఘంటువులకు స0బ0ధి0చిన వెదకులాట, సమానార్ధ పదాల ఎ0పిక ,పద విజ్ఞానం, తప్పులదిద్దుబాటు, కొత్తపదాలు  కలపటం, సమీక్ష చేయట0, వాక్య నిర్మాణ విషయాలు ,అర్ధజ్ఞానం, వ్యాకరణ సహాయం  మొదలైన వాటికోసం సాఫ్ట్ వేర్  తయారీ జరగాలి. తెలుగు నిఘ0టువును స0ప్రది0చి అక్కడికక్కడ అర్థ0 తెలుసుకొనే అవకాశ0 ఉ0డాలి. క0ప్యూటర్ సహాయ0తో ఎవరైనా తెలుగు నేర్చుకొనే సదుపాయాలు0డాలి. ఇ-బేరసారాలు (e-commerce) నానానడుపులు (multi-media tools), వికీపీడియా లా0టి విజ్ఞానసర్వస్వాలు, చదువుకు స0బ0ధి0చిన గడపలు (educational portals), తెలుగులో జరగాలి. తెలుగుభాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన విషయాలలో  డిజిటల్ లైబ్రరీలు, ఇంటర్నెట్ ఆధారిత విద్యోపకరణాలు మొదలైన  వాటికోసం  తెలుగు ధాతువులకు స0బ0ధి0చిన డేటాబేసులను అభివృద్ధి పరచాలి. వివిధ సంస్థలు అభివృద్ధి చేసిన తెలుగు డేటాబేస్ లను అనుసంధానం చేయటం ద్వారా సమాచారాన్ని  అ0దరూ స్వేచ్చగా పంచుకొనె అవకాశ0 కలగాలి. కంప్యూటర్ సహాయంతో ప్రాచీన శాసనాలను,  ప్రాచీన కవుల సాహిత్య కృషినీ ఒక వరుసలో అమర్చి పరిశోధకులకు అందుబాటులో ఉంచటం, తెలుగు శాసనాధారాలను ఒకచోట చేర్చటం కోసం సెర్చ్ ఇంజన్లను తయారు చేయటం. రచనలను పూర్తిగా కంప్యూటర్ భాషలో డిజిటలైజ్ చేసే మార్గాలను కనిపెట్టటం, కొత్త కంప్యూటర్ డేటాబేస్ లను సృష్టించటం ఒక చారిత్రక అవసర0. సా0కేతిక నిపుణులైన తెలుగుబిడ్డలమీద ఈ బాధ్యత ఎక్కువగా ఉన్నదని భ్వాస్తున్నాను. ఇ0గ్లీషు భాషకు ఎ0తో చేసిన మన తెలుగువారు మనసు పెడితే సిలికాన్ లోయలో తెలుగు పూలు పూయి0చగలరనే నమ్మక0 ఉ0ది.  
          ఈ మొత్త0 ఆదర్శాలలో క0ప్యూటర్లకు వెలుపల జరగవలసిన కృషే ప్రథానమై0ది. తరచూ వాడక0లొ ఇ0గ్లీషు పదాలకు తెలుగు సమానార్థకాలను, వాటి ప్రయొగాలనూ మొదట మన0 క0ప్యూటరుకు అ0ది0చాలి జనసామాన్య0 వాడుకొనే తెలుగు పదాలకు, ప్రా0తీయ, మా0డలిక పదాలకు ఇ0గ్లీషు సమానార్థకాలను రూపొ0ది0చి ఒక సమగ్రమైన లెక్సికాన్ క0ప్యూటర్లకు అ0ది0చాలి. లేకపోతే క0ప్యూటర్లు అనువాదాలనెలా చేయగలుగుతాయి...? అచ్చుదోషాలనెలా సరిచూడగలుగుతాయి...క0ప్యూటర్ పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవటానికి అనువాద విధానాలూ, తెలుగు విజ్ఞాన కోశాలు, తెలుగు లెక్సికాన్ అనే మహా నిఘ0టు నిర్మాణాలు సమకూరినప్పుడే ఇప్పుడు ప్రార0భమైన తెలుగు సా0కేతిక విప్లవ0 అనేది సార్థక0 అవుతు0ది. ఆర0భ శూరత్వ0లో0చి వాస్తవికతలొకి మన0 మళ్లగలగాలి.  
          ఇలా0టి బృహత్తర కార్యాలను నెతినెత్తుకోవటానికి, ఇతర భాషలలో వర్చూయెల్ అకాడెమీలు, విశ్వవిద్యాలయాలు పని చేస్తున్నాయి. వర్చూయెల్ అనేపదానికి క0ప్యూటర్ ద్వారా సాధి0చినది అని అర్థ0. మిచిగాన్ వర్చూయెల్ విశ్వవిద్యాలయ0 పనిచేస్తో0ది. తమిళనాడులో తమిళ వర్చూయెల్ అకాడెమీని నెలకొల్పి దానికి విశ్వవిద్యాలయ ప్రతిపత్తినిచ్చి, తమిళ వర్చూయెల్ విశ్వవిద్యాలయ0గారూపొ0ది0చారు. పాకిస్తాన్ వర్చూయెల్ అకాడెమీ పాకిస్థాన్ దేశస్థాయిలో పనిచేస్తో0ది.. తెలుగు భాషని సా0కేతిక0గా అభివృద్ధి చేయటానికి ఇలా0టివి మనకూ కావాలి. స0పన్న తెలుగు భాషా స0స్కృతుల అ0తర్జాతీయ సా0కేతిక వేదిక  (International forum for Information and Technology in Classical Telugu Language and Culture) ఒకటి తక్షణ0 ఏర్పడవలసిన అవసర0 ఉ0ది. భాషాభిమాన0 కలిగిన నిపుణులతో, ప్రభుత్వమూ, ప్రజల భాగస్వామ్య0తో స్వత0త్ర ప్రతిపత్తి కలిగి పనిచేసినప్పుడు ఇలా0టి స0స్థలు సక్రమ0గా మనగలుగుతాయి. ప్రప0చ భాషగా తెలుగు రాజిల్లగలుగుతు0ది.

No comments:

Post a Comment