Sunday 4 December 2011

వైభవంగా జరిగిన సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం


వైభవంగా జరిగిన సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం

సిలికానాంధ్ర పదకొండో ఆంధ్ర సాంస్కృతికోత్సవం కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో శనివారం రాత్రి (భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం) అత్యమ్యంత వైభవంగా జరిగింది. సిలికాన్‌వేలీ లోని వివ్ధ ప్రాంతాల నుండి రెండు వేలకు మందికి పైగా తెలుగువారు హాజరై పది గంటల పాటు 350 మంది బాల, యువ, మహిళా కళాకారులు ప్రదర్శించిన సంగీత, నృత్య, నాటక, జానపదా ప్రదర్శనలు ప్రేక్షకులను సాంస్కృతిక విందునందించాయి. ప్రాంతీయ బేధాలు మరచి వందలాది మంది మహిళలు ప్రదర్శించిన ఎల్లమ్మ నృత్యం, బతుకమ్మ క్యూపర్టినో నగరాన్ని ఉర్రూతలూగించాయి. రాష్ట్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిధిగా పాల్గొని సిలికానాంధ్ర ప్రపంచంలో అరుదైన సమ్ష్త అనిప్రశంసించారు. భాషా సాహిత్య సంస్కృతులను పరిరక్ష్మిచేందుకు అహర్నిశ పాటుపడుతున్న సిలికానాంధ్ర దేశ విదేశాల్లోని తెలుగువారికి ఆదర్శమని అన్నారు. ' దేశభాషలందు తెలుగు లెస్స ' అన్న మాట ఎంత ప్రధానమైనదో తెలుగు సమ్ష్థ లన్నిటిలో సిలికానాంధ్ర మిన్న అని పొన్నాల చెపారు. మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ సిలికానాంధ్రకు సంస్కృతి పరిరక్షణకు సంబంధించి గొప్ప ఆలోచనలున్నాయని వాటిని నిజం చేసే శక్తిగల సాంస్కృతిక సైనికుల్లాంటి కార్యకర్తలున్నారని అయితే ఆర్ధికంగా తగిన సహకారం అందించాలని అన్నరు. ప్రముఖ వైణికుడు వీణ శ్రీనివాస్ నిర్వహణలో సాగిన కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చ్యాత్య సంగీత సంగమం, అనూష కూచిభోత్ల నృత్య కల్పనలో సాగిన స్వర గంగాఝరి, మైం మధు చే మౌన తరంగం, స్నేహ వేదుల ఆధ్వర్యంలో జరిగిన జానపద నృత్యాలు, శిరిని సూరపనేని నృత్య రూపకల్పనలో సాగిన ఆంధ్ర కళా విలాసం, పద్మిని సరిపల్లె, రత్నమాల వంక సారధ్యంలో పాటలపల్లకి, విజయసారధి మాడభూషి నేతృత్వంలో ప్రదర్శించిన రాణా ప్రతాప్ నాటకం తదితర ప్రదఋసనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ అద్యక్షులు అచార్య అనుమండ్ల భూమయ్య జ్వలిత కౌసల్య పద్య కావ్యం నాలుగో ముద్రణను ప్రవాసాంధ్రుడు డా. లక్కిరెడ్డి హన్మిరెడ్డి ఆవిష్కరించారు. తెలుగు విశ్వవిద్యాలయ అధ్యాపకుడు డా. చెన్నయ్య గారి వ్యాఖ్యానం కార్య్క్రమానికి నిండుదనం సంతరించింది.

No comments:

Post a Comment