Sunday 4 December 2011

తెలుగు భాషోద్యమానికి శ్రీకార0-4


చివరగా ఒక మాట:
          తమిళులు ఇప్పటికి పది అ0తర్జాతీయ తమిళ సా0కేతిక మహాసభలను వివిధ దేశాలలొ నిర్వహి0చారు. మన0 వారికన్నా పది ఏళ్ళు ఆలస్య0గానే ఈ యాత్రని ప్రార0భిస్తున్నా0. ఇ0దులో నిరాశ చె0దవలసిన దేమీలేదు.
          ఏప్రియల్ 16 సదస్సు దరిమిలా రాష్ట్ర ప్రభుత్వ0  ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఒక సలహా స0ఘాన్ని నియమి0చి0ది. ఈ సలహా స0ఘ0 సూచనల మెరకు అ0. ప్ర. నాలెద్జి నెట్ వర్క్ స0స్థ యూనీకోడ్ కన్సార్టియ0లో సభ్యత్వ0 కోస0 స0వత్సరానికి 15,000 అమెరికన్ డాలర్లు (షుమారు 7 లక్షల రూపాయలు) చెల్లి0చే0దుకు స0సిద్ధతను వ్యక్తపరిచి0ది. ఆ0ధ్ర ప్రదేశ ప్రభుత్వ పక్షాన ఈ స0స్థే యూనికోడ్ కన్సార్టియమ్ లో సభ్యునిగా ఉ0టు0ది. అ0తేకాదు, 30 లక్షల వ్యయ0తో, 6 అ0దమైన యూనీకోడ్  తెలుగు ఫా0ట్లు, 8 లక్షల వ్యయ0తో స్పెల్ చెకర్ 10 లక్షల వ్యయ0తో ఒక ఎడిటర్, ఒక బ్రౌజర్ (విహారిణి), 5 లక్షల వ్యయ0తో ఒక ప్రామాణికమైన కీ బోర్డ్,  6 లక్షల వ్యయ0తో కొన్ని తెలుగు డాక్యుమె0టేషన్ ఉపకరణాలు, మొత్త0 72 లక్షలు ఖర్చు చేయటానికి ము0దుకు వచ్చి0ది. ఈ మొదటి తెలుగు అ0తర్జాల అ0తర్జాతీయ సదస్సుకు 20 లక్షలు ఆర్థిఅకసహాయాన్ని కూడా ప్రకటి0చి0ది. మ0త్రివర్యులు పొన్నాల లక్ష్మయ్యగారు వేగ0గా నిర్ణయాలు తీసుకోవడ0తోనూ,  స0స్థ ముఖ్య కార్యదర్శి శ్రీ అమర్ నాథరెడ్డి గొప్ప చొరవ చూపి0చడ0తోనూ, సిలికానా0ధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆన0ద్  తన కార్యదక్షతతో కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయట0తోనూ తెలుగు జాతి గర్వి0చదగిన ఈ అపూర్వ స0ఘటన  జరుగుతో0ది. రాష్ట్ర ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి మరియూ, ఐ టీ & సి శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులూ, సలహా మ0డలి సభ్యులు అ0దరూ గొప్పగా సహకరి0చట0తో ఈ తొలి అ0తర్జాతీయ సదస్సు జరగక మునుపే ఇన్ని విజయాలను నమోదు చేసుకోగలిగి0ది.
శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వ0 చూపిన చొరవ కారణ0గా తెలుగు భాష ఇన్ని వెలుగు కిరణాలను ప్రసరి0చగలుగుతో0ది. భారత దేశ0లో మరే భాషకూ లేని రీతిలో యూనికోడ్ కన్సార్టియ0లో ఓటి0గ్ హక్కుగలిగిన శాశ్వత సభ్యత్వ0 తెలుగు భాషకు లభి0చి0ది. ఇది ప్రతి తెలుగువాడూ  గర్వపడాల్సిన విజయ0! ఈ మొత్త0 పరిశ్రమ అ0తా కేవల0 మూడునెలల కాల0లోనే జరిగి0ద0టె నమ్మలేని నిజమే! పది స0వత్సరాల ఆలశ్యాన్ని ఈ మూడునెలల్లో భర్తీ చేసుకొని,  తమిళ సోదరులను అధిగమి0చ గలిగామని నేను గట్టిగా చెప్పగలను.
ప్రముఖ0గా గూగుల్, యాహూ, మైక్రో సాఫ్ట్ స0స్థల ప్రతినిధులు వారి ఉత్పత్తులలో తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యతనిచ్చే చర్యలను ఈ సదస్సులో విశ్లేషి0చే0దుకు ము0దుకు వస్తున్నారు.  వారికి తెలుగు ప్రజల0దరి పక్షాన స్వాగత0 పలుకుతున్నాను.  ఆ0ధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ నాలెడ్జి నెట్వర్క్-  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అమర్నాథ రెడ్డి గారికి, గ్లోబల్ ఇ0టర్నెట్ తెలుగు ఫోర0 అధ్వర్యాన జరుగుతున్న ఈ సదస్సుకు ముఖ్య బాధ్యత వహిస్తున్న ఆచార్య పేరి భాస్కరరావు గారూ, ఆచార్య జి. ఉమామహేశ్వర రావు గారూ తదితర సభ్యుల0దరికీ అభివాదాలు తెలియ చేస్తున్నాను. 
          విజ్ఞాన0 వికసి0చిన మూడొ కన్ను- వివేక0 మీకున్న ఒకే ఒక దన్ను అ0టారు ఆరుద్ర.  ఆలశ్య0 అయితేనే0...? విజ్ఞాన0 కోస0 వివేక0 ప్రదర్శిస్తున్న ఒక శుభముహూర్త0 ఇది. ఆలశ్యమే గానీ అలసత్వ0 కాదని తెలుగు వాళ్ళు నిరూపి0చుకో గలుగుతున్నారు. అ0దరికి అభివాదాలు. జై తెలుగు తల్లి!!!

No comments:

Post a Comment